రాష్ట్ర ప్రభుత్వం 2021 జనవరి నుంచి చేపట్టబోయే భూ సర్వేలో 1903లో సర్వే నిర్వహించిన గిల్ మెన్ రికార్డుల ఆధారంగా సింహాచలం భూముల హక్కుదారులని గుర్తించాలని... ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ప్రధాన కార్యదర్శి అజ శర్మ కోరారు. దేవస్థానం భూములు వ్యాజ్యాలలో... కక్షిదారునిగా ఉన్న దేవస్థానం ఈవోను నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ నుంచి తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ భూముల వ్యవహారంలో యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయటంతో... ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉన్న స్థలాలపై వారికి, క్రయ విక్రయాలతో సహా నిర్మాణాలకు అనుమతించాలన్నారు. దేవస్థానంకు 1996-97 లో ఇచ్చిన స్థలాలను అధికారులు సూచించిన మేరకు వెంటనే రద్దు చేయాలని, ఈ భూములను పంచ గ్రామాల భూములుగానే పిలవాలని, దేవస్థానం భూములుగా పేర్కొనడం నిలిపివేయాలని కోరారు.