మన్యంలో యువతకు క్రీడా సామగ్రి అందజేత - police encouraging touth in manyam
యువత చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, చెడు మార్గం వైపు దృష్టి మళ్లకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విశాఖ మన్యం జి. మాడుగులలో పౌరసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకు క్రీడా సామగ్రి అందజేశారు.
![మన్యంలో యువతకు క్రీడా సామగ్రి అందజేత civil servive by srpf and civil police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6203940-902-6203940-1582654055588.jpg)
విశాఖ మన్యంలో యువత తప్పు దోవ పట్టకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పౌరసేవలో భాగంగా యువతకు చేరువయ్యేందుకు సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు తమవంతు కృషి చేస్తున్నారు. జి. మాడుగులలో విద్యార్థులకు వాలీబాల్, క్రికెట్, షటిల్కు సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారు. మహిళలకు ప్లాస్టిక్ బకెట్లు అందజేశారు. యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటే సమాజానికి మంచిదని సీఐ శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ రెండో కమాండెంట్ సెల్వ కుమార్, ఓఎస్డీ కృష్ణారావు, డీఎస్పీ రాజ్ కమల్ పాల్గొన్నారు.