ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిశ్రమను మూసివేసి కారకులను అరెస్ట్ చేయండి' - ఎల్జీ గ్యాస్ లీక్ వార్తలు

గ్యాస్ లీక్ ఘటనతో విధ్వంసం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేయాలని విశాఖలో పౌర, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

Civil and public associations dharnna in vizag against lg poymers
ఎల్జీ పాలిమర్స్​కు వ్యతిరేకంగా విశాఖలో ధర్నా

By

Published : Jun 1, 2020, 2:24 PM IST

13 మంది మృతికి కారణమై పెను విధ్వంసం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖలో పౌర, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పౌర, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేసి యజమానులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రజాసంఘాల నాయకులు, మహిళలు పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details