రైతులకు మద్దతుగా విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన - Visakhapatnam district newsupdates
విశాఖలో సీఐటీయూ కార్యకర్తలు దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్ధతుగా నిరసన చేపట్టారు. నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
![రైతులకు మద్దతుగా విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన CITU protest in support of farmers in Visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10057659-763-10057659-1609319824291.jpg)
రైతులకు మద్దతుగా విశాఖలో సీఐటీయూ నిరసన
దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్ధతుగా విశాఖలో సీఐటీయూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అన్నదాతలు తమ హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయటం సరైన పద్ధతి కాదని.. సీఐటీయూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
అమరావతికి 20 ఎకరాలు ఇచ్చిన రైతు కన్నుమూత
TAGGED:
విశాఖ జిల్లా తాజా వార్తలు