లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10 వేల రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. మాదవధారలో సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు సనపల రామ్ గోపాల్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్మికులతోపాటు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వలన వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.