విశాఖ జిల్లా సీఐటీయూ అధ్యక్షడు శంకరరావు ఆధ్వర్యంలో పాడేరులో కార్యకర్తలు ఆందోళన చేశారు. పేదలు 40 రోజులుగా మద్యం మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం అమ్మకాలు చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేశారు. గిరిజన సంఘం సభ్యులు.. తహసీల్దార్ షేక్ హుస్సేన్ కు ఈ మేరకు వినతి పత్రం అందించారు.