వైద్య, నర్సింగ్ సిబ్బందిని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, రెండు నెలలుగా వారు అందిస్తున్న సేవలు త్యాగనీయమైనవని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్ రావు అన్నారు. కరోనాతో పోరాడుతున్న వైద్య ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వాలు కంటితుడుపుగా సన్మానాలు, పూలమాలలతో సరి పెడుతున్నాయని, ఈ సందర్భంగా వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం విశాఖ నగర ప్రధాన కార్యదర్శి గంగారం, నగర నాయకుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ డిమాండ్స్ డే - సీఐటీయూ రాష్ట్ర ఆధ్యక్షుడు నర్సింగ్ రావు తాజా వార్తలు
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అహర్నిశలు ముందుండి పని చేస్తున్న వైద్య, సిబ్బందికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందించలేదని సీఐటీయూ ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖ సీపీఎం కార్యాలయంలో సీఐటీయు డిమాండ్స్ డే నిరసన నిర్వహించారు.
సీఐటీయూ డిమాండ్స్ డే నిరసన