అనకాపల్లిలో సీఐటీయు విశాఖ జిల్లా కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు తెలిపారు. యూనియన్‌తో ప్రమేయం లేకుండా కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఐటీయు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నవంబర్ 26న దేశ వ్యాప్త సమ్మెకు సీఐటీయు పిలుపు - CITU calls for nationwide strike on November 26
అనకాపల్లిలో సీఐటీయు విశాఖ జిల్లా కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఐటీయు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ 26న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 26న దేశ వ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపు