కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ, డివైఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. అగ్రి చట్టాల రద్దు కోరుతూ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరములో 'సేవ్ ఇండియా - సేవ్ ఫార్మర్' అని రాసి నిరసన వ్యక్తం చేశారు.
నెల రోజులుగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు వీరోచితంగా పోరాటం చేస్తున్నా మోదీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదన్నారు. పైగా రైతుల పోరాటాన్ని హేళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.