ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈ నెల 20న విశాఖ బహరంగసభకు తరలిరండి' - మద్దిపాలెంలో సీఐటీయూ నేతల నిరసన వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విశాఖ జిల్లా మద్దిపాలెంలో సీఐటీయూ నేతలు ధర్నా చేశారు. ఈనెల 20న స్టీల్ ప్లాంట్ వద్ద జరిగే బహిరంగసభకు ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

citu agitation at maddipalem
మద్దిపాలెంలో సీఐటీయూ నేతల ధర్నా

By

Published : Mar 13, 2021, 10:53 AM IST

విశాఖ జిల్లా మద్దిపాలెంలో సీఐటీయూ నేతలు నిరసన వ్యక్తం చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని నినాదాలు చేశారు. కేంద్రం.. ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే అపాలన్నారు. లేకపోతే.. పెద్దఎత్తున కార్మికులను, విద్యార్థి, మహిళా సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల నేతలు, అఖిల భారత నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details