విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన రంగనాయకమ్మకు ఏపీ సీఐడీ ఇప్పటికే అరెస్టు నోటీసులిచ్చింది. తాజాగా మాల్లాది రఘునాథ్ అనే వ్యక్తికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చిన అధికారులు..సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. కుట్రపూరితంగానే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని సీఐడీ ప్రకటించింది.
రంగనాయకమ్మ తర్వాత.. మరో వ్యక్తికి సీఐడీ నోటీసులు - విశాఖ గ్యాస్ లీకేజ్ న్యూస్
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురికి సీఐడీ నోటీసులిస్తోంది. తాజాగా మల్లాది రఘునాథ్ అనే వ్యక్తికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
రంగనాయకమ్మ తర్వాత.. మరో వ్యక్తికి సీఐడీ నోటీసులు