ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్

By

Published : Jun 23, 2020, 10:07 AM IST

Updated : Jun 23, 2020, 11:29 AM IST

తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ 3 రోజుల కిందట కిషోర్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

nalanda kishore
nalanda kishore

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నలంద కిశోర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీబీఎం కాంపౌండ్​లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆరోగ్యం సరిగా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా.. పోలీసులు వినలేదని కిషోర్ బంధువులు తెలిపారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిషోర్ అనుచరుడు కావడంతో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

విజయవాడకు కిశోర్: న్యాయవాది సుమన్

నలంద కిశోర్‌ను విజయవాడకు తరలిస్తున్నట్లు...ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సుమన్‌ తెలిపారు. కిశోర్‌పై ఐపీసీ 505(బి), 120(బి) కింద కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు?

Last Updated : Jun 23, 2020, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details