విశాఖ జిల్లా అనకాపల్లిలోని దేవాలయాల రథాలను సీఐ భాస్కరరావు పరిశీలించారు. అంతర్వేది రథం దగ్ధం సంఘటన నేపథ్యంలో రథాలకు భద్రత కల్పించారు. నూకాలమ్మ, గవరపాలెం గౌరీ పరమేశ్వరుల రథాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుంకరమెట్ట సూర్యనారాయణ స్వామి, గవరపాలెం కనకదుర్గ ఆలయ రథాన్ని పరిశీలించారు. ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు, పురోహితులు, దేవస్థాన అధికారులతో మాట్లాడిన సీఐ.. ఆలయాల రథాలకు భద్రత కల్పిస్తున్నట్లు వివరించారు.
అనకాపల్లిలో దేవాలయాల రథాలను పరిశీలించిన సీఐ - ankapally latest news
అంతర్వేది రథం దగ్ధం సంఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలోని దేవాలయాలు, రథాలకు భద్రత కల్పించారు. పట్టణ సీఐ భాస్కరరావు సిబ్బందితో ఆలయాల రథాలను పరిశీలించారు.

అనకాపల్లిలో దేవాలయాల రథాలను పరిశీలించిన సీఐ