విశాఖ జిల్లా చోడవరంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా గేట్లు తాళాలు వేసి... తాళ్లు కట్టి ఉంటున్నాయి. ఇదంతా.. కరోనా వలనే. ఎందుకంటే చోడవరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో... ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తగా.. ఈ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గేటును మూసివేసి అక్కడ ఓ బాక్సును ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ఎవరైనా వినతి పత్రాలు ఆ బాక్సులోనే వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప.. కార్యాలయానికి ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
'మీ వినతులు బాక్సులో వేయండి ప్లీజ్'
అవి ప్రభుత్వ కార్యాలయాలే... కానీ ప్రజలు రావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయ గేట్లు మూసివేస్తున్నారు. మీకేమైనా సమస్యలు ఉంటే.. వినతి పత్రాలను గేటు ముందున్న బాక్సులో వేసి వెళ్లమంటున్నారు. ఇదంతా ఆ ప్రభుత్వ కార్యాలయ అధికారుల ముందస్తు జాగ్రత్తలు... కరోనా మహమ్మారి బారిన పడకుండా!
వినూత్నంగా వినతుల స్వీకరణ