విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఉత్తమ రాజకీయ నాయకుడిగా ప్రశంస లభించింది. గోవా రాష్ట్రం పనాజీలో నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో కేంద్ర ఆయుష్, రక్షణ శాఖల సహాయమంత్రి శ్రీపాద నాయక్ చేతుల మీదుగా అవార్డును ఎమ్మెల్యే అందుకున్నారు. పనాజీలోని 'చాణిక్య' సామాజిక సంస్థ ఆధ్వర్యంలో గోవా మాజీ సీఎం పద్మ విభూషణ్ డాక్టర్ మనోహర్ పాలేకర్ 65 జయంతి పురస్కరించుకొని... ఈ అవార్డు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ చేపట్టిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా చేకూరుతున్న ప్రయోజనాన్ని ఎమ్మెల్యే ధర్మశ్రీ వివరించారు.
ఉత్తమ రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ - విశాఖ జిల్లా వార్తలు
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఉత్తమ రాజకీయ నాయకుడిగా అవార్డు లభించింది. గోవా రాష్ట్రంలోని పనాజీలో నిర్వహించిన కార్యక్రమంలో ధర్మశ్రీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఉత్తమ రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ