మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణలోవ పోతురాజు బాబు ఆలయంలో జరిగిన చండీ యాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు.. ఈ నెల పదో తేదీ సాయంత్రం లాంఛనంగా ప్రారంభం కాగా ఈరోజు ముగియనున్నాయి.
కల్యాణలోవ పోతురాజుబాబు ఆలయంలోని చండీ యాగం - kalyanalova pothuraju babu temple latest news
విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణలోవ పోతురాజు బాబు ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కళ్యాణ పోతురాజు బాబు ఆలయంలోని చండీ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ