విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో నిర్మించబోయే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కోరారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశలో... ముంపునకు గురయ్యే బుచ్చెయ్యపేట మండలం పంగిడి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పంగిడి గ్రామస్థులు ప్రాజెక్టు కోసం త్యాగం చేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో కొందరు మాట్లాడుతూ... ప్రాజెక్టు పేరుతో మమ్మల్ని రోడ్డున పడేయ్యవద్దని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరూ మెరుగైన ప్యాకేజీ అంశాన్ని గ్రామసభ ముందు ఉంచారు.
సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించండి: ఎమ్మెల్యే ధర్మశ్రీ - Uttarandhra Sujala Sravanthi Project
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు... సహకరించాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కోరారు.
mla dhramsree