జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో సచివాలయం ద్వారానే సుపరిపాలన అందించేందుకు కసరత్తు చేస్తున్నారని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలోని రోలుగుంట మండలంలోని అచ్చంపేట, కొండ పాలెం, పసర్లపూడి తదితర గ్రామాల్లో సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను నేరుగా తమ స్వస్థలాలకే పొందేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అప్పలనాయుడు, పోతన శ్రీనివాసరావు, గొర్ల చెల్లమ్మ నాయుడు పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు.