ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ చింతపల్లిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు - విశాఖ జిల్లాలో చలి తీవ్రత వార్తలు

విశాఖ జిల్లాలో చలితీవ్రత అధికంగా నమోదు అవుతోంది. నిన్న చింతపల్లిలో 11 డిగ్రీలు, పాడేరు 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీపావళి తర్వాత చలి తీవ్రత పెరగాల్సింది. కానీ రెండు వారాల ముందే మన్యానికి చలిగాలుల ఉద్ధృతి విస్తరించింది.

Chintapalli recorded
Chintapalli recorded

By

Published : Nov 10, 2020, 7:44 AM IST

విశాఖ మన్యంపై చలి పులి పంజా విసిరింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 11 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో గతనెల 30, 31వ తేదీల్లో వరుసగా 14, 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మళ్లీ అత్యల్పంగా సోమవారం ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ సౌజన్య తెలిపారు. దీపావళి తర్వాత చలి తీవ్రత పెరగాల్సింది పోయి రెండు వారాల ముందే మన్యానికి చలిగాలుల ఉద్ధృతి విస్తరించడం ప్రారంభమైంది. ఈ కారణంగా మన్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో జనసంచారం తగ్గుముఖం పడుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details