విశాఖ మన్యంలోని మారుమూల గ్రామాల్లో చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు పర్యటించారు. స్థానిక సీఐ, ఎస్సైలతో కలిసి చింతపల్లి క్యాంపు, టీఆర్సీ క్యాంపు, బూసుకొండ గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మన్యంలోని పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి ఆయన పర్యటించినట్లు సమాచారం. అనంతరం సీలేరు పోలీసుస్టేషన్‌ను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మన్యంలోని మారుమూల గ్రామాల్లో చింతపల్లి ఏఎస్పీ పర్యటన - Police are on high alert in Visakhapatnam
చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు విశాఖ మన్యం మారుమూల గ్రామాల్లో పర్యటించారు. మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
![మన్యంలోని మారుమూల గ్రామాల్లో చింతపల్లి ఏఎస్పీ పర్యటన Chintanpalli ASP visits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9766103-631-9766103-1607092990712.jpg)
చింతపల్లి ఎఎస్పీ పర్యటన