ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఉత్సాహంగా బాలల దినోత్సవం - childerns day cebrations latest news in vizag

విశాఖపట్నంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

విశాఖలో ఉత్సాహంగా బాలల దినోత్సవం

By

Published : Nov 15, 2019, 7:52 AM IST

విశాఖలో ఉత్సాహంగా బాలల దినోత్సవం
విశాఖ వీఎమ్​ఆర్డీఏ థియేటర్​లో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్​లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని అలరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రులు బహుమతులు అందించారు.

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ నాడు-నేడు పథకం ఒక ఛాలెంజ్ కార్యక్రమం అనీ, ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి ఇంగ్లీష్ అవసరమని, ప్రభుత్వం తెలుగును రద్దు చేయలేదని వివరించారు. తల్లిదండ్రులు చదవాలని విద్యార్థులపై ఒత్తిడి పెట్టకూడదని మంత్రి అవంతి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details