విశాఖ నేవీ చిల్డ్రన్స్ స్కూల్ ఆధ్వర్యంలో జల సంరక్షణ అంశంపై చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. నెల రోజులపాటు సాధన చేసి నృత్యాలు చేశారు. మద్దిలపాలెం సీఎంఆర్ మాల్ వేదికగా జల శక్తీ -జన శక్తి పేరిట నేవీ స్కూల్ చిన్నారులు నృత్యాలతో అలరించారు. ప్రకృతి వనరులు కాపాడాలని చెబుతూ వారు ఇచ్చిన సందేశం పెద్దలను సైతం ఆలోచింప జేసింది. నీటి సంరక్షణకు పాటించాల్సిన అంశాలు, వృథా చేస్తే జరిగే నష్టం నృత్య రూపకంలో తెలియజేస్తూ ఫ్లాష్ మాబ్ కొనసాగింది.
ఔరా!...జలసంరక్షణ కోసం చిన్నారుల ఫ్లాష్ మాబ్ - flash mab
విశాఖలో నేవీ చిల్డ్రన్ పాఠశాల ఆధ్వర్యంలో జలసంరక్షణ అంశంపై చిన్నారులు చేసిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది.
![ఔరా!...జలసంరక్షణ కోసం చిన్నారుల ఫ్లాష్ మాబ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4284217-779-4284217-1567110565398.jpg)
చిన్నారుల ప్రదర్శన
ఔరా అనిపించినా చిన్నారుల జలసంరక్షణ ప్రదర్శన
ఇది కూడా చదవండి.