విశాఖలో సృష్టి ఆస్పత్రి నుంచి పసిపిల్లల అక్రమ రవాణా జరుగుతోంది. సృష్టి ఆస్పత్రిపై పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశారు. సృష్టి ఆసుపత్రి కేసులో కీలక సూత్రధారిగా ఉన్న వైద్యురాలు నమ్రతను పోలీసులు రిమాండ్ కు తరలించారు. కర్ణాటకాలో ఆదివారం ఉదయం నమ్రతను అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రానికి ప్రధాన నిందితురాలిని విశాఖకు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పసిపిల్లల విక్రయం కేసులో అరెస్ట్ అయిన మరో 5గురిని ఆదివారం సాయంత్రమే రిమాండ్ కు తరలించారు. మరోవైపు.. కేసు విచారణలో భాగంగా నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
సృష్టి ఆస్పత్రి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో.. రిమాండ్కు కీలక సూత్రధారి నమ్రత - సృష్టి ఆస్పత్రి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు
విశాఖలో సంచలనం సృష్టించిన సృష్టి ఆసుపత్రి కేసులో కీలక సూత్రధారిగా ఉన్న వైద్యురాలు నమ్రతను పోలీసులు రిమాండ్ కు తరలించారు. కర్ణాటకలో ఆదివారం ఉదయం నమ్రతను అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రానికి ప్రధాన నిందితురాలిని విశాఖకు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
child-trafficking
Last Updated : Jul 28, 2020, 8:14 PM IST