ప్రపంచ బాల కార్మిక నిరోధక దినం సందర్భంగా విశాఖలో బాల కార్మిక వ్యవస్థ నిరోధకం-విద్యాహక్కు చట్టం పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సదరన్ రీజనల్ స్టీరింగ్ కమిటీ, బాలవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.
నూతన ప్రభుత్వంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిరోధించేందుకు ఎటువంటి పథకాలు అమలు కాబోతున్నాయి.. విద్యాహక్కు చట్టం మార్గనిర్దేశకాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ హైమావతి, ఏయూ మాజీ వైస్ ఛాన్స్లర్ రమణ, పలువురు విద్యా, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.