ఆడుకుంటూ మంటల్లో పడి తీవ్ర గాయాలైన చిన్నారి సుస్మిత(6) తుది శ్వాస విడిచింది. వైజాగ్ కేజీహెచ్‌లో మృత్యువుతో పోరాడి ఓడింది. ఈనెల 23న విశాఖ జిల్లా హుకుంపేట మండలం సరసపాడులో పిల్లలతో ఆడుకుంటూ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 60 శాతం కాలిపోయిన బాలికను.. హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాడేరు.. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఆరో రోజులపాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి.. చివరికి ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అగ్ని ప్రమాదానికి గురైన చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి - విశాఖలో అగ్నిప్రమాదంలో చిన్నారి మృతి వార్తలు
అగ్ని ప్రమాదానికి గురై.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి.. మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈనెల 23న విశాఖ జిల్లా సరసపాడులో పిల్లలతో ఆడుకుంటూ మంటల్లో చిక్కుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి మృతి చెందటం.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అగ్ని ప్రమాదానికి గురైన చిన్నారి మృతి
ఇవీ చూడండి...:పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తల ఆందోళన