ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో శారద పీఠాన్ని సందర్శించనున్న సీఎం జగన్ - Chief Minister jagan tour in Visakha

విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. శారదా పీఠాన్ని సందర్శించనున్న సీఎం రెండు గంటల పాటు అక్కడే గడపనున్నారు. పీఠంలో నిర్వహించనున్న పూర్ణాహుతికి హాజరై ప్రత్యేక పూజలు చేయనున్నారు

విశాఖలో శారద పీఠాన్ని సందర్శించనున్న సీఎం జగన్
విశాఖలో శారద పీఠాన్ని సందర్శించనున్న సీఎం జగన్

By

Published : Feb 3, 2020, 5:01 AM IST

Updated : Feb 3, 2020, 7:22 AM IST

విశాఖలో శారద పీఠాన్ని సందర్శించనున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. శారదాపీఠం వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.....దాదాపు 2 గంటల పాటు అక్కడే గడపనున్నారు. వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన యజ్ఞ యాగాదుల్లోనూ జగన్ పాల్గొననున్నారు.

  • పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి జగన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
  • అక్కడి నుంచి ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న రాజశ్యామల అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.
  • ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన విశ్వశాంతి హోమం, చతుర్వేద హవనంల వద్ద పూజలు నిర్వహిస్తారు.
  • నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు.
  • అనంతరం వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం చేతుల మీదుగా స్వర్ణకంకణ ధారణ జరగనుంది.

హజరుకానున్న ప్రముఖులు

శారదాపీఠం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై, భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి సైతం విశాఖకు రానున్నారు

ఇవీ చదవండి

పారిశ్రామికవేత్త తనయుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు

Last Updated : Feb 3, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details