విశాఖ జిల్లాలో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో నిన్న, నేడు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మూగజీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుచ్చయ్యపేట మండలం మంగళాపురంలో.. ఎండ వేడిమి తట్టుకోలేక 600 కోళ్లు మరణించాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కోళ్లు మృత్యువాత పడి… ఆర్థికంగా నష్టపోయానని కోళ్ల ఫారం యజమాని వాపోతున్నాడు.
ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడ్డ కోళ్లు - high temperatures in visakha news
విశాఖ జిల్లాలో రెండు రోజులుగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుచ్చయ్యపేట మండలం మంగళాపురంలో.. ఎండ తీవ్రత తాళలేక ఫారంలోని కోళ్లు మరణించాయి.
![ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడ్డ కోళ్లు died chickens](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:06:08:1622259368-al-vsp-40-29-highlytemprature-av-ap10151-29052021090109-2905f-1622259069-525.jpg)
మరణించిన కోళ్లు
ఇదీ చదవండి:కాకినాడలో వీధి శునకాలకు చికెన్ బిర్యానీ