ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి సమస్య తీవ్రం.. ఖాళీ బిందెలతో నిరసన - విశాఖలో తాగు నీటి సమస్యలు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ... విశాఖ జిల్లా చెరుకుపల్లి గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో మూడు చేతి బోర్లు ఉన్నా.. ఏ ఒక్కటీ పనిచేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Cherukupalli tribals
తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో నిరసన

By

Published : Dec 21, 2020, 12:58 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం చెరుకుపల్లి ప్రాంత గిరిజనులు తాగునీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటూ... ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో మూడు చేతి బోర్లు ఉన్నా సరిగా పని చేయటం లేదన్నారు. ఒక బోరు నుంచి మట్టి నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు పనిచేయక గెడ్డ నీరు తాగుతున్నామని తెలిపారు. అయితే.. 5 లక్షల రూపాయలతో బోరు బావి తీసి, పైపులైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయినట్లు అధికారులు చెప్పారు.

కానీ.. నేటికీ ఆ పనులకు మోక్షం లభించిలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు విసుగు చెందిన గ్రామీణులు మైదాన గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, సీపీఎం మండల కార్యదర్శి దేముడునాయుడు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కారం చేయకుంటే... మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details