ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరవాడ ఫార్మా సిటీ.. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుడి కుటుంబానికి పరిహారం - పరవాడ తాజా వార్తలు

పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్​లో..గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన గౌరీ శంకర్ కుటుంబానికి పరిహారం అందింది. ప్రభుత్వం తరపున..రూ.15 లక్షలు, సాయినార్ కంపెనీ తరపున రూ.35 లక్షల చెక్కులను మంత్రి ముత్తంశెట్టి బాధితులకు అందించారు.

cheques distribution
cheques distribution

By

Published : Jul 25, 2020, 7:31 PM IST

విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్​లో.. జూన్ 29 న జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన గౌరీ శంకర్ కుటుంబానికి పరిహారం చెక్కులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15 లక్షల చెక్కును..మృతుని భార్య కోట్ల వెంకట లక్ష్మికి అందించారు. సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35 లక్షల మొత్తానికి సంబంధించి.. మృతిని భార్యకు రూ. 10 లక్షలు, తండ్రి మహంతి లక్ష్ము నాయుడుకు రూ. 12.50 లక్షలు, తల్లి మహంతి అప్పల నరసింహకు రూ. 12.50 లక్షల చెక్కులను సైతం మంత్రి అందించారు.

ABOUT THE AUTHOR

...view details