విశాఖ జిల్లా వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు పరిహారం అందజేశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఆనుకొని ఉన్న 5 గ్రామాల్లో 19,893 మంది బాధితులకు 19 కోట్ల 82 లక్షల రూపాయలు వారివారి ఖాతాలో జమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం అందజేత - vizag gas leak latest news
విశాఖ ఘటన బాధితులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు పరిహారం అందజేశారు. ఘటన రోజు సేవలు అందించిన పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులను మంత్రి సన్మానించారు.
హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి లక్ష రూపాయల వంతున 445 మందికి 4 కోట్ల 45 లక్షల రూపాయలు అందజేశారు. అస్వస్థతకు గురైన 99 మందికి 25 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేసింది. గ్రామంలో 25 పాడి పశువులు చనిపోగా... 8 లక్షల 75 వేల రూపాయల పరిహారం అందజేశారు. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు కృషి చేసిన పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బందిని మంత్రి అవంతి శ్రీనివాసరావు శాలువా కప్పి సన్మానించారు.
ఇదీ చదవండి:విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు