ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ హెచ్​పీసీఎల్​ కాలుష్య అధ్యయనంపై నిపుణుల కమిటీ - విశాఖ హెచ్​పీసీఎల్ పై చెన్నై ఎన్జీటీ కమిటీ

విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అధ్యయనానికి జాతీయ హరిత ట్రైబ్యునల్.. నిపుణుల కమిటీని నియమించింది. హెచ్‌పీసీఎల్ వెదజల్లుతున్న కాలుష్యంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. విశాఖ పవన ప్రజా కార్మిక సంఘం వేసిన వ్యాజ్యాన్ని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారించింది.

న
విశాఖ హెచ్​పీసీఎల్​ కాలుష్య అధ్యయనంపై నిపుణుల కమిటీ

By

Published : Feb 26, 2021, 2:22 AM IST

విశాఖ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అధ్యయానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. హెచ్‌పీసీఎల్ వెదజల్లుతున్న కాలుష్యంతో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని విశాఖ పవన ప్రజా కార్మిక సంఘం వేసిన పిటిషన్​ను ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారించింది.

హెచ్‌పీసీఎల్ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మురికినీటితో జలవనరులు కలుషితమవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్జీటీకి విన్నవించారు. ఈ అంశంలో కాలుష్య ప్రభావం అధ్యయానానికి కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ కెమికల్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు, అధికారులతో కమిటీని నియమించింది. కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏప్రిల్ రెండో వారం నాటికి నివేదిక అందజేయాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:పీజీ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్​ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details