ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాకలోనే పాఠశాల... వరుణుడితో విద్యార్థుల పోరాటం! - పాఠశాల భవనం లేక వర్షంలో ఇబ్బందులు పడుతున్న చెక్కల మద్దిపాలెం విద్యార్థులు

విశాఖ మ‌న్యంలోని గూడెం కొత్త‌వీధి మండ‌లం మొండిగెడ్డ‌ పంచాయ‌తీ చెక్క‌ల మ‌ద్దిపాలెంలో 28 మంది విద్యార్థులు ఉన్నా.. పాకలోనే వారి చదువు సాగుతోంది. నిన్న ఈ ప్రాంతంలో వచ్చిన భారీ వర్షానికి విద్యార్థులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

no school in chekkalamaddipalem, students problems in hut due to heavy rains at chekkalamaddipalem
చెక్క‌ల మ‌ద్ది పాలెంలో పాకలోనే పాఠశాల, భారీ వర్షం ధాటికి చెక్క‌ల మ‌ద్ది పాలెంలో విద్యార్థుల అవస్థలు

By

Published : Mar 27, 2021, 7:31 PM IST

పక్కా భవనం లేక విద్యార్థుల అవస్థలు

నాడు-నేడు ప‌నుల ద్వారా కోట్లాది రూపాయ‌లు వెచ్చించి పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మిస్తున్నా.. విశాఖ మ‌న్యంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకునేందుకు గూడు క‌రవైంది. ఏటా కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తున్నామ‌ని అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. మా బ్రతుకులు మారవంటూ విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ చెక్కల మద్దిపాలెం విద్యార్థులు ఘోషిస్తున్నారు. గిరిజ‌న ఉప‌ప్ర‌ణాళిక నిధులూ తమకు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కొండలు, గుట్టలు దాటాల్సిందే...

ఈ ప్రాంతంలో సుమారు 28 మంది విద్యార్థులు ఉన్నారు. పంచాయ‌తీ కేంద్రం నుంచి సుమారు తొమ్మిది కిలోమీట‌ర్లు కొండ‌లు, గుట్ట‌లు దాటి చెక్క‌ల మ‌ద్దిపాలెం కాలిన‌డ‌క‌న వెళ్లాలి. ఇక్కడ పాఠ‌శాల భ‌వ‌నం లేదు. ఈ గ్రామానికి ఉపాధ్యాయుడిగా వ‌చ్చిన వ్య‌క్తి.. త‌న సొంత నిధుల‌తో పాక‌ను నిర్మించారు. ఇందులోనే విద్యార్థుల‌కు పాఠాల‌ను బోధిస్తున్నారు.

వరుణుడితో పారాటం తప్పదు...

శుక్ర‌వారం ఈ ప్రాంతంలో కురిసిన భారీ వ‌ర్షానికి విద్యార్థులు ప‌డిన పాట్లు అన్నీఇన్నీ కావు. పాక నుంచి వ‌ర్ష‌పు నీరు ప‌డుతున్న‌ా.. పుస్తకాలు త‌డ‌వ‌కుండా గోనెసంచులు చేత‌బ‌ట్టుకుని విద్యార్థులు పెద్ద పోరాటమే చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువ‌కులు ఈ దృశ్యాల‌ను చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌డంతో.. ఇక్కడి పాఠ‌శాల దుస్థితి గురించి చుట్టుపక్కల చ‌ర్చ జ‌రుగు‌తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెక్క‌ల‌మ‌ద్ది పాలెం పాఠ‌శాల‌కు ప‌క్కా భ‌వ‌నం నిర్మించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏయూలో కరోనా కేసులపై మంత్రి ఆళ్ల నాని ఆరా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details