ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శారదాపీఠంలో చాతుర్మాస్య దీక్షలు - విశాఖ శారదాపీఠం తాజా వార్తలు

చాతుర్మాస్య దీక్షలకు విశాఖ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. సకల మానవాళికి శుభం కలగాలని ఏటా చాతుర్మాస దీక్షలను చేపడుతోందని పీఠాధిపతులు తెలిపారు. సెప్టెంబరు రెండో తేదీ వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.

విశాఖ శారదాపీఠంలో చాతుర్మాస్య దీక్షలు
విశాఖ శారదాపీఠంలో చాతుర్మాస్య దీక్షలు

By

Published : Jul 6, 2020, 1:00 AM IST

సనాతన హైందవ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చాతుర్మాస్య దీక్షలకు విశాఖ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. రిషికేష్​లోని పీఠానికి చెందిన ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. సెప్టెంబరు రెండో తేదీ వరకు చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది. రిషికేశ్​లో ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరంలో గంగమ్మ తల్లికి పీఠాధిపతులు పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు. ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేశారు. వ్యాస పూజతో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details