Chaos in GVMC Council Meeting: విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. గృహ నిర్మాణం, ప్రోటోకాల్‌పై సరైన సమాధానం ఇవ్వాలని తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండానే మేయర్ అజెండాలు కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కార్పొరేటర్లు.. పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో పోడియం వద్ద వైకాపా, తెలుగుదేశం కార్పొరేటర్ల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్, వైకాపా కార్పొరేటర్ల తీరును ఖండిస్తూ.. విపక్షాలు పోడియం వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మేయర్ హరి వెంకటకుమారి సభను వాయిదా వేసి వెళ్లిపోగా.. విపక్ష సభ్యులు అక్కడే కూర్చుని నిరసన కొనసాగించారు.
రసాభాసగా విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం - GVMC
GVMC Council Meeting: విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. గృహ నిర్మాణం, ప్రొటోకాల్‌పై సరైన సమాధానం ఇవ్వాలని తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండానే మేయర్ అజెండాలు కొనసాగించారు. దీంతో పోడియం వద్ద కూర్చుని విపక్షాల నిరసన చేపట్టాయి.
రసాభాసగా విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం
ఇవీ చూడండి
- బిహార్ సీఎంగా నీతీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం.. 'డిప్యూటీ'గా తేజస్వీ
- నీతీశ్ దెబ్బకు భాజపాకు కొత్త కష్టాలు.. కీలకంగా వైకాపా!
- ఉపరాష్ట్రపతిగా చివరి రోజు.. తరాలపాటు గుర్తుండే పని చేసిన వెంకయ్య!