కొవిడ్-19 (కరోనా వైరస్) కట్టడి దిశగా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మార్పు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన అన్ని ప్రదేశాలు ప్రస్తుతం కంటైన్మెంట్గా కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో ఉన్న 15 కంటైన్మెంట్ జోన్ల పరిధిని 500 మీటర్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.
విశాఖలోని కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మార్పులు - migrants latest news in visakhapatnam district
విశాఖ జిల్లాలోని కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మార్పు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. జిల్లాలో ఉన్న 15 కంటైన్మెంట్ జోన్ల పరిధిని 500 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లే విషయమై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మార్పు
వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పాలనాధికారి వివరించారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సడలింపుల కారణంగా అనేక పరిశ్రమలు తెరుచుకుంటున్నాయని... ఉపాధి దక్కే అవకాశం ఉందని సూచించారు. దుకాణాలను మధ్యహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు వివరించారు. దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.