Chandrababu New Vision 2047: విజన్ 2047 పేరుతో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితికి ఎదగటానికి 5 వ్యూహాలతో ముందుకు సాగాలని తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్లోబల్ ఎకానమీగా భారత అర్దిక వ్యవస్థ, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ సాంకేతికత భావి నాయకత్వం, ఎనర్జీ భద్రత, నీటి భద్రత వంటి వాటిని ప్రధానంగా.. ఈ విధాన పత్రంలో చర్చకు పెట్టారు. విశాఖలో ఈ దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ఆయన.. దీనిపై విస్తృత చర్చ జరగాలని సూచించారు.
స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని.. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సాగర తీరంలో వాక్ నిర్వహించారు. ఆర్కే బీచ్లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వేల మందితో ఆయన నడక సాగించారు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా సాగగా.. పలువురు అభిమానులతో ఆయన సెల్ఫీలు దిగారు.
Chandrababu visited Gaddar's Family : 'పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్'
అనంతరం వీఎంఆర్డీఎ ఎంజీఎం మైదానంలో ఇండియా,ఇండియన్స్, తెలుగూస్-విజన్ 2047 పేరిట విధాన పత్రాన్ని విడుదల చేశారు. ‘గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్సఫర్మేషన్’ దీనిని రూపొందించింది. పలు రంగాల ప్రముఖులు, కార్పొరేట్, పర్యావరణ రంగాల ప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నారు. విజన్ 2047లో ప్రతిపాదించిన 5 వ్యూహాలపై చంద్రబాబు చర్చకు నాంది పలికారు.
గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పౌరులుగా భారతీయులు, బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు ఎదగాల్సిన తీరును వివరించారు. డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ పీ 4 మోడల్ సంక్షేమం సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత (ఇన్నోవేషన్) భావి నాయకత్వం అంశాల ప్రాధాన్యాలను చంద్రబాబు వివరించారు.