ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చింది చంద్రబాబే' - polavaram project latest news

పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చింది తెదేపా అధినేత చంద్రబాబేనని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి వల్లే... నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గందరగోళం నెలకొందని విమర్శించారు.

minister kanna babu
minister kanna babu

By

Published : Nov 1, 2020, 9:05 PM IST

మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు

రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలను ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... తెదేపాపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తెదేపా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ అన్నారని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చింది చంద్రబాబేనని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి వల్లే... నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గందరగోళం నెలకొందని విమర్శించారు.

మరోవైపు అమరావతిలో ఉద్యమాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమకు వ్యతిరేక ఉద్యమంగా మంత్రి అభివర్ణించారు. నారా లోకేశ్​కు సీఎం జగన్​ను విమర్శించే స్థాయి లేదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details