సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం చంద్రబాబు దిగజారుడు తనంగా మాట్లాడుతున్నారని విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు... మతిస్తిమితం కోల్పోయి ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందనే వాస్తవం చంద్రబాబుకు తెలియడం వల్లే...ఆయన కేంద్ర ప్రభుత్వం, ఈసీ పైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని అవంతి విమర్శించారు.
ఓడిపోతామనే భయంతో...ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన చంద్రబాబు విమర్శలు - విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం చంద్రబాబు.... ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన నిందలు వేస్తున్నారని భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.
![ఓడిపోతామనే భయంతో...ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన చంద్రబాబు విమర్శలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2996823-thumbnail-3x2-avanthi.jpg)
భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు
భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు
ఇవి కూడా చదవండి:
TAGGED:
సీఎం చంద్రబాబు