ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలం అప్పన్నకు వైభవంగా సహస్ర ఘటాభిషేకం - chandanotsavam at simhadri news

విశాఖలోని సింహాచలం అప్పన్న చందనోత్సవంలో భాగంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా ఏకాంతంగానే కార్యక్రమాలన్నీ జరిపించినట్లు ఆలయాధికారులు తెలిపారు.

Sahasra Ghatabhishekam
సహస్ర ఘటాభిషేకం

By

Published : May 14, 2021, 11:47 PM IST

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ఆఖరి ఘట్టం సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరిపించారు. అత్యంత ప్రసిద్ధమైన, పరమపావన పశ్చిమ వాహిని గంగధార నుంచి తీసుకొచ్చిన తీర్థంతో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేష ఆరాధన, శీతల నివేదన జరిపి తొలివిడత చందనం సమర్పిస్తారు.

కరోనా వేళ.. ప్రజలంతా ఆయురారోగ్య, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. నిజరూపంలో దర్శనమిచ్చిన సింహాద్రినాధుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు దేవస్థానం ధర్మకర్త సంచైత గజపతి, ఈవో ఎంవి.సూర్యకళ వెల్లడించారు. స్వామివారికి జరగాల్సిన వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయంగా ఏకాంతంగానే నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదైనా నిజరూప దర్శనభాగ్యం భక్తులకు కలగాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details