విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రావణ పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కరాళ చందన సమర్పణ చేశారు. తొలి విడతగా చందనోత్సవం నాడు సుగంధద్రవ్యాలతో మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు మణుగుల చొప్పున నాలుగు విడతలుగా చందన సమర్పణ పూర్తైన తర్వాత శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందన సమర్పణం చెయ్యటం ఆనవాయితీ. స్వామికి చందన లేపనం చేసి మెరుగులు దిద్ది కరాళ చందన సమర్పిస్తారు. పరిపూర్ణ చందన స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు.
సింహాద్రి అప్పన్నకు కరాళ చందనం సమర్పణ - విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధి
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారికి కరాళ చందన సమర్పణ చేశారు. పరిపూర్ణ చందన స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు.
సింహాద్రి అప్పన్నకు కరాల చందనం సమర్పణ