చదలవాడ సుచరిత కథనం మేరకు.. రెండేళ్లుగా కుటుంబ వివాదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన ఇద్దరు తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హత్య చేసి ఆ నేరాన్ని భర్త చదలవాడ కృష్ణమూర్తిపైకి తోసేసి ఆయన్ను జైలుకు పంపించి, తద్వారా ఆస్తులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. స్పందన లేదన్నారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ వీడియోను ఆమె విడుదల చేశారు.
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: చదలవాడ సుచరిత - తనకు ప్రాణహాని ఉందని సుచరిత పోలీస్లకు కామెంట్స్
తనను చంపేందుకు ఇద్దరు కుట్ర పన్నుతున్నారని, ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని చదలవాడ సుచరిత తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి కోసం కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

chandalawada sucharitha complaint to police