1933 అక్టోబరు 7న కార్యకలాపాలను ప్రారంభించిన విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. విశాఖ పోర్టు ట్రస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీన పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పోర్టులో నిర్వహిస్తున్న కార్యకలాపాలను సందర్శించేందుకు 6, 7 తేదీలలో అవకాశం కల్పిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. నిర్ణయించిన తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయత్రం ఐదు గంటలలోపు బీచ్ రోడ్డులోని ఫిషింగ్ హార్బర్ వద్దకు రావల్సిందిగా పోర్టు యాజమాన్యం తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హరనాథ్ కోరారు.
పోర్టును వీక్షించాలనుకునేవారు...కె బాపిరాజు డిప్యూటీ చీఫ్ లా ఆఫీసర్.... సీహెచ్ అవతారం నాయుడు డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్.... ఎండి ముస్తాక్ డాక్ ఇన్స్పెక్టర్ సంప్రదించవచ్చు.
విశాఖ పోర్టు ఆవిర్భావ దినోత్సవం... సందర్శకులకు అవకాశం
విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీన పోర్టు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 6, 7 తేదీలలో పోర్టులో నిర్వహించే ఎగుమతి, దిగుమతి అంశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు.
విశాఖ పోర్ట్ ను సందర్శించే అవకాశం
ఇదీ చూడండి: డేంజర్ మలుపుల్లో డేరింగ్ ఫీట్లు