ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీలందరూ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలి: చలసాని - ఆంధ్రా ఎంపీలందరూ ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని చలసాని డిమాండ్

ఎంపీలందరూ ప్రధాని ఇంటిముందు ధర్నా చేపట్టాలని.. విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ అని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయపక్షాలు కలిసి పోరాడాలని కోరారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాలు ఎన్నికల లబ్ధి కోసమేనని ఆరోపించారు.

Chalasani Srinivas
ప్రధాని ఇంటి ముందు ధర్నా

By

Published : Feb 14, 2021, 6:03 PM IST

రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ సూచించారు. విశాఖలోని డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ అని, కరీంనగర్, ఆదిలాబాద్ వాసులు కూడా విశాఖ స్టీల్ కోసం ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. కేంద్ర నిర్ణయంపై రాజకీయపక్షాలు కలిసి పోరాడాలని కోరారు. కార్మికులతో కలిసి పార్టీలు ఉద్యమాన్ని నడిపించాలన్నారు.

ఎన్నికల లబ్ధి ముఖ్యమా..?

పోలవరం నిధుల్లోనూ, బడ్జెట్​లోనూ రాష్ట్రానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వలేదని చలసాని ఆరోపించారు. తెలుగు వారులేని కేబినేట్​లో ఆంధ్ర భవిష్యత్తును నిర్ణయిస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చలేదు.. ఉన్న స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల లబ్ధి కోసమే కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని.. అది అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాల వల్ల ఉపయోగం లేదని చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details