ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్​లో ఈనెల 8న 'చలం సంజీవదేవ్' పుస్తకావిష్కరణ - chalam sanjevadev book release

లేఖ సాహిత్యానికి అందం, అర్థం, సంపూర్ణత్వం సిద్ధింపజేసిన ప్రఖ్యాత తెలుగు రచయితలు గుడిపాటి వెంకటాచలం - డాక్టర్ సంజీవ దేవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు, సాహితీ పరిచయం చేస్తూ చలం ఫౌండేషన్ 'చలం సంజీవదేవ్' పుస్తకాన్ని ప్రచురించింది. ఈ ఇరువురి సాహితీ స్నేహం, ఆనాటి సామాజిక స్థితిగతులను తెలియజేసే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు చలం ఫౌండేషన్ ట్రస్టీ గాలి ఉదయ్ కుమార్ తెలిపారు.

ఆన్​లైన్​లో ఈనెల 8న 'చలం సంజీవదేవ్' పుస్తకావిష్కరణ
ఆన్​లైన్​లో ఈనెల 8న 'చలం సంజీవదేవ్' పుస్తకావిష్కరణ

By

Published : Nov 5, 2020, 5:48 PM IST

విశాఖపట్నంలో చలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'చలం సంజీవదేవ్' పుస్తకాన్ని ప్రచురించారు. చలం పౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని జస్టిస్ ఏ రామలింగేశ్వర రావు ఈనెల 8న ఆన్​లైన్​ వేదికగా ఆవిష్కరించనున్నారు.

వారి స్నేహం ఓ ప్రేరణ..

తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసుకున్న ఈ ఇరువురు రచయితల మధ్య సాగిన లేఖా సంవాదం, ప్రస్తుత సాహితీ ప్రేమికులకు ప్రేరణ కలిగించనుందని చలం పౌండేషన్ ట్రస్టీ ఉదయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో..

అంతర్జాల వేదికగా జరగనున్న చలం సంజీవదేవ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, చలం రచనలపై పరిశోధన చేసిన వావిలాల సుబ్బారావు, సాహితీవేత్త వాడ్రేవు వీరలక్ష్మి దేవి అతిథులుగా పాల్గొననున్నట్లు గాలి ఉదయ్ కుమార్ వివరించారు.

పేర్లు నమోదు చేేసుకోండి..

పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు 'చలం గుడిపాటి డాట్ కామ్' వెబ్​సైట్లో తమ పేర్లను నమోదు చేసుకుని ఆహ్వాన పత్రాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది'

ABOUT THE AUTHOR

...view details