విశాఖ పెందుర్తి మండలం గొరపల్లిలో పొలానికి వెళ్తున్న మహిళ మెడలో గొలుసును దుండగులు దొంగిలించారు. సుబ్బాయమ్మ(47) అనే మహిళ పోలానికి నడిచి వెళ్తుండగా.. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి గొలుసు లాక్కెళ్లారు. ఐదు తులాల బంగారు గొలసు చోరీకి గురైందని మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. పెందుర్తిలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు - పెందుర్తిలో గొలుసు దొంగలు
విశాఖ పెందుర్తి మండలం గొరపల్లిలో మహిళ మెడలోని ఐదు తులాల గొలుసును దుండగులు లాక్కెళ్లారు. మహిళ పొలం పనులకు వెళ్తుండగా ఘటన జరిగింది.
chain snatching at pendhurthi