శివానంద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన చాగంటి కోటేశ్వరరావు - బీమునిపట్నంలో చాగంటికోటేశ్వరరావు
శాస్త్రం, ధర్మాన్ని దాటి గురువులు వెళ్లరని... అవే వారికి ప్రాణమని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు వివరించారు. సద్గురు శివానందమూర్తి ఎంతోమందికి మార్గదర్శనం చేశారని కొనియాడారు.
శివానంద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన చాగంటి కోటేశ్వరావు
విశాఖలోని సద్గురు శివానందమూర్తి ఆశ్రమం ఆనందవనంలో... శివానంద ధ్యాన మందిర ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సద్గురువులు చూపే మార్గంపై ఆయన ప్రసంగించారు. పరమాత్మ స్వరూపమే సద్గురువని అభివర్ణించారు. విదేశీయుల భారతీయ సంప్రదాయంలో గురువుల పాత్రపై ఎన్నో అంశాలను అధ్యయనం చేశారని చెప్పారు. ప్రార్థన మందిరంలో తొలి ప్రసంగం చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చాగంటి పేర్కొన్నారు.