ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కేంద్ర బృందం - పాయకరావుపేటలో పంటనష్టం

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పంట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం పర్యటించింది. మునిగిపోయిన ధాన్యాన్ని అధికారులకు రైతులు చూపించి... ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Central team examining submerged crops in payakaraopeta
కేంద్ర బృందం పర్యటన

By

Published : Dec 3, 2020, 2:47 PM IST

విశాఖ జిల్లా పాల్తేరు, కోటవురట్ల ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం వచ్చింది. నీట మునిగి కుళ్లిపోయిన పంటను రైతులు ఈ బృందానికిచూపించి ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరారు. నష్టపోయిన ప్రతి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందించి నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖకు అందిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details