విశాఖపట్నం పోర్ట్‌ను కేంద్ర నౌకాశ్రయ, జలరవాణా శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్రంజన్ సందర్శించారు. మౌలిక వసతులు, చేపట్టిన అభివృద్ధి పనులు, యాంత్రీకరణ వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. విశాఖ సహజనౌకాశ్రయం, దాని అధారంగా మరిన్ని పరిశ్రమల విస్తరణలకు ఉన్న మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాలని.. పోర్టులో యాంత్రీకరణ నిరంతరాయంగా జరిగేట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోర్ట్ కార్య నిర్వాహక భవనంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, సెమ్స్ , లైట్ హౌస్ అపోర్ట్ అధికారులతో ఆయా సంస్ధలలో జరుగుతున్న కార్యకలాపాలను మరింత చురుగ్గా సాగించేందుకు నిర్దిష్ట సూచనలను చేశారు.
'మరిన్ని పరిశ్రమల విస్తరణకు వాటి మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాలి' - విశాఖపట్నంలో కేంద్ర నౌకాశ్రయ కార్యదర్శి
విశాఖ సహజనౌకాశ్రయం.. దాని అధారంగా మరిన్ని పరిశ్రమల విస్తరణకు వాటి మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాలని కేంద్ర నౌకాశ్రయ, జలరవాణా శాఖ కార్యదర్శి డా. సంజీవ్ రంజన్ అధికారులకు సూచించారు. విశాఖపట్నం పోర్ట్‌ను ఆయన సందర్శించారు.
!['మరిన్ని పరిశ్రమల విస్తరణకు వాటి మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాలి' Central Ports and Water Transport Department Secretary visited visakhapatnam Port](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11198302-627-11198302-1616991548419.jpg)
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కేంద్ర నౌకాశ్రయ కార్యదర్శి
ఛైర్మన్ కె .రామమోహనరావు, పోర్ట్ డెప్యూటీ ఛైర్మన్, కార్యదర్శి అయా విభాగాధిపతులతో నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రణాళికకు అనుగుణంగా ఆచరించాల్సిన కార్యాచరణను వివరించారు. భారీ నౌకలను తీసుకువచ్చేందుకు చేసిన డ్రెడ్జింగ్ కార్యకలాపాలను అధికారులు ఆయనకు తెలిపారు. కరోనా సమయంలోనూ పోర్టు ధనాత్మక వృద్ధిరేటును నమోదు చేసిందని చెప్పారు.
ఇదీ చూడండి.ఊరంతా పం‘చేట్టు’!