విశాఖలోని ఫిషింగ్ హార్బర్(visakhapatnam fishing harbour)ను కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే(central minister ramdas athawale news)సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తానని తెలిపారు(Fishermens inclusion in SC -ST list). ఆంధ్రా మత్య్సకారులు ఒడిశాలో ఇబ్బంది పడుతున్నారన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి కేంద్రం వద్ద డీపీఆర్ పెండింగ్లో ఉందని.. ఆ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలతో మత్స్యకారులకు వేట ఇబ్బందిగా ఉందని... అందుకే ప్రభుత్వం వారికి సహాయం చేసే ఆలోచనలో ఉందన్నారు.
Central Minister Ramdas Athawale: 'మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తా' - రాందాస్ అఠవాలే వార్తలు
మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో(Fishermens inclusion in SC-ST list news) చేర్చడానికి ప్రయత్నిస్తానన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే(central minister ramdas athawale news). వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
![Central Minister Ramdas Athawale: 'మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తా' central minister ramdas athawale](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13387906-661-13387906-1634553589508.jpg)
Fishermen demand inclusion in SC/ST list