ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Hyd - Visakha high way: హైదరాబాద్​-విశాఖ మార్గానికి.. కేంద్రం పచ్చజెండా! - ఆంధ్రప్రదేశ్ వార్తలు 2021

హైదరాబాద్​ - విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణలోని ఖమ్మం నుంచి రాష్ట్రంలోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు సమాచారం.

central-government-approval-for-another-road-between-hyderabad-visakhapatnam
హైదరాబాద్​-విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా

By

Published : Jul 10, 2021, 11:01 AM IST

హైదరాబాద్‌ - విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. తెలంగాణలోని ఖమ్మం నుంచి విశాఖ జిల్లా దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గాన్ని పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది.

హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్‌ లేన్‌ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అక్కడి నుంచి విశాఖ వరకు ఇప్పటికే 4 వరుసల మార్గం ఉంది. ప్రణాళిక మేరకు పనులన్నీ పూర్తయితే హైదరాబాద్‌ నుంచి దేవరాపల్లి మీదుగా విశాఖకు 625 కి.మీ. మార్గం 4 వరుసలుగా విస్తరించినట్లు అవుతుంది. ఖమ్మం నుంచి దేవరాపల్లి మార్గానికి నంబరు కేటాయించటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు సమాచారం.

పెరిగిన జాతీయ రహదారులు..

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత మెరుగైన రహదారుల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకురావటం, జిల్లా, మండల స్థాయిలో రహదారి వ్యవస్థను మెరుగుపరచటం ద్వారా మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం నాటికి కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది.

57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే.. కేవలం నాలుగున్నరేళ్లలోనే అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల తెలంగాణ రాష్ల్రంలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్​వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా.. దేశ సగటును మించింది.

ఇదీ చూడండి:

మళ్లీ పెరిగిన చములు ధరలు- పెట్రోల్​ లీటర్​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details